ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు: న్యాయమూర్తి

ప్రజాశక్తి-చీరాల: ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించరాదని చీరాల కోర్టు సివిల్‌ జడ్జి ఎం సుధ అన్నారు. సోమవారం రమేష్‌ డయాగస్టిక్స్‌ వారి ఆధ్వర్యంలో చీరాల కోర్టులో ఉచిత మెడికల్‌ క్యాంప్‌ను ఆమె ప్రారంభించారు. బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఎం రమేష్‌ ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఎం సుధ మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇటువంటి క్యాంపులు నిర్వహించి మంచి ఆరోగ్యంగా ఉండటానికి లాయర్లు పని ఒత్తిడిలో పడి వారి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయరాదని అన్నారు. బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ జి రమేష్‌బాబు మాట్లాడుతూ ఇటువంటి క్యాంపు ఉచితంగా నిర్వహించినందుకు రమేష్‌ డయాగస్టిక్స్‌ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు రమేష్‌ ల్యాబ్‌ వారిని ఆమె అభినందించారు. ఇప్పటివరకు తమకు సహాయ సహకారాలు అందించిన రమేష్‌ ల్యాబ్‌ నుంచి రమేష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్యాంపులో 100 మందికి పైగా షుగర్‌, కొలెస్ట్రాల్‌ లెవెల్‌, గుండెకి సంబంధించి ఈసీజీ పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, న్యాయవాదులు పలువురు పాల్గొన్నారు.

➡️