ఆరోగ్యశ్రీతో కార్పొరేట్‌ వైద్యం

ప్రజాశక్తి- బొబ్బిలి : ఆరోగ్యశ్రీతో పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందుతుందని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. పట్టణంలోని మంగళవారం ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5లక్షల నుంచి రూ.25లక్షలకు పెంచినట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణ, వైస్‌ చైర్మన్‌ చెలికాని మురళి, వైసిపి పట్టణ అద్యక్షులు చోడిగంజి రమేష్‌ నాయుడు, జెసిఎస్‌ కన్వీనర్‌ విస్సు, మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.శ్రీనివాసరావు పాల్గొన్నారుబాడంగి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకం కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టుందని జెడ్‌పిటిసి రామారావు, ఎంపిపి సలహాదారు తెంటు మధుసూదన్‌ అన్నారు. మంగళవారం పిన్నవలస సచివాలయంలో నిర్వహించిన ఆరోగ్యశ్రీ డిజిటల్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. పేద రోగులకు సంబంధించి వ్యయ పరిమితి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఈ పథకం ద్వారా గతంలో కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల వరకు చికిత్స చేసేవారని దాన్ని ఇప్పుడు రూ. 25లక్షలు వరకూ పెంచారని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం పై ప్రజలకు ఎలాంటి సందేహాలూ లేకుండా ఇంటింటికి ప్రచారం చేసి ఆరోగ్యశ్రీ యాప్‌ డౌన్లోడ్‌ చేసుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు తెంటు తిరుపతి నాయుడు, ఎంపిడిఒ ఆంజినేయులు, వైద్యలు, సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు ఆరోగ్య శ్రీకార్డులు పంపిణీడెంకాడ: రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పరిమితి రూ.10 లక్షల నుండి రూ. 25 లక్షల వరకు పెంచిన నేపథ్యంలో మోపాడ పిహెచ్‌సిలో ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు చేతులు మీదుగా మంగళవారం నూతన ఆరోగ్య శ్రీ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం నెల్లిమర్ల నగర పంచాయతీలో కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బంటుపల్లి వాసుదేవరావు, జెడ్‌పిటిసి గదల సన్యాసి నాయుడు, నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ బంగారు సరోజిని, వైస్‌ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.నెల్లిమర్ల: వైసిపి ప్రభుత్వం పేదల ఆరోగ్యం, సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పల నాయుడు అన్నారు. మంగళవారం స్ధానిక సచివాలయంలో ఆరోగ్యశ్రీ రూ.25 లక్షల పథకాన్ని ఎమ్మెల్యే బడ్డుకొండ, ఎమ్మెల్సీ డాక్టర్‌ పి.సురేశ్‌ బాబు ప్రారంభించి కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల నగర పంచాయతీ చైర్‌ పర్సన్‌ బంగారు సరోజిని, వైస్‌ చైర్మన్‌ సముద్రపు రామారావు, జెడ్‌పిటిసి గదల సన్యాసి నాయుడు, నగర పంచాయతీ వైసిపి అధ్యక్షులు చిక్కాల సాంబశివరావు, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రేగాన శ్రీనివాస రావు, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా సతీష్‌, పాల్గొన్నారు.వేపాడ: స్థానిక పిహెచ్‌సిలో మంగళవారం ఆరోగ్యశ్రీ కార్డులను జెడ్‌పిటిసి సేనాపతి అప్పలనాయుడు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ బిఎస్‌కేఎన్‌ పట్నాయక్‌, పిహెచ్‌సి వైద్యాధికారి ఏ ధరణి, కాలేజీ ప్రిన్సిపల్‌ కే అప్పారావు, సి హెచ్‌ఓ ఆంజనేయులు, దంగేటి సత్యనారాయణ ఎమ్మెల్‌ హెచ్‌పి కోమలి, వైద్య సిబ్బంది ముత్యాలమ్మ, వెంకటలక్ష్మి, పాల్గొన్నారు.చీపురుపల్లి: దేశంలోనే అత్యుత్తమ పథకం ఆరోగ్యశ్రీ అని ఎంపిపి ఇప్పిలి వెంకటనర్శమ్మ, వైసిపి జిల్లా కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాస నాయుడు అన్నారు. నూతనంగా మంజూరైన ఆరోగ్యశ్రీ కార్డులను స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కర్రోతు రమణ, కొసిరెడ్డి రమణ, పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.వంగర: ప్రభుత్వం పేదలకు ఐదు లక్షల నుండి 25 లక్షలకు పెంచుతూ విడుదల చేసిన ఆరోగ్యశ్రీ కార్డులను ఎంపిపి ఉత్తరా వెల్లి సురేష్‌ ముఖర్జీ, వైసిపి మండల అధ్యక్షులు కరణం సుదర్శన్‌ రావు చేతుల మీదుగా స్థానిక మండల కేంద్రం సచివాలయం వద్ద మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వంగర వైద్య అధికారి సుస్మిత డయానా, హెచ్‌డి తవిటమ్మ, వైసిపి నాయకులు కనగల పారినాయుడు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.రామభద్రపురం: పేద కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పెంపు ఒక వరం అని ఎంపిపి చొక్కాపు లక్ష్మణరావు తెలిపారు. పెంచిన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక సచివాలయంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ రమామణి, స్థానిక వైద్యాధికారి పిల్లి దిలీప్‌ కుమార్‌, హెల్త్‌ సూపర్‌వైజర్‌ వాసుదేవరావు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

➡️