ఆరోగ్య పరీక్ష ఫలితాలను అర్హులు ధ్రువీకరించాలి

ప్రజాశక్తి-బాపట్ల: ఆసుపత్రుల్లో క్లినికల్‌ లేబరేటరీ, డయగ్నోస్టిక్‌ సెంటర్లలో, రక్త పరీక్షలు వంటి ఆరోగ్య పరీక్షలు చేసిన పత్రాలపై అర్హత గల పెథాలజిస్ట్‌ ధ్రువీకరించాలని చట్టం చెబుతున్నప్పటికీ బాపట్ల జిల్లాలో అమలు జరగడం లేదని ప్రజా సంఘాల నాయకులు సోమవారం స్పందనలో జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాపట్ల నియోజకవర్గ బీఎస్పీ అధ్యక్షులు కొచ్చర్ల వినరురాజు మాట్లాడుతూ రక్త పరీక్షలు, ఇతర పరీక్షల ధ్రువీకరణను పర్యవేక్షించాల్సిన జిల్లా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి ఈ చట్టాన్ని అమలు చేయడంలేదన్నారు. ఈ చట్టాన్ని కాపాడి ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలని స్పందనలో ఇచ్చిన అర్జీలో పేర్కొన్నట్లు వినరురాజు తెలిపారు. అర్జీ అందజేసిన వారిలో అంబేద్కర్‌ యువజన సంఘ అధ్యక్షులు గుదే రాజారావు పాల్గొన్నారు.

➡️