ఆర్‌జెడి విస్తృత పర్యటన

Dec 2,2023 21:20

 ప్రజాశక్తి-వేపాడ  :  మండలంలో శనివారం ఆర్‌జెడి ఎం.జ్యోతికుమారి విస్తృతంగా పర్యటించారు. ఆదర్శ పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. విద్యార్థుల ప్రతిభను, అకడమిక్‌ కేలండర్‌ ప్రకారం సిలబస్‌ను పరిశీలించారు. నోట్‌ బుక్స్‌లో తప్పులను పరిశీలించారు. 9వ తరగతి విద్యార్థులకు ఇచ్చిన ట్యాబుల వినియోగం, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడుతూ సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని తెలిపారు. అనంతరం ఎంఆర్‌సి కార్యాలయాన్ని సందర్శించారు. సిఆర్‌పిలు, ఎంఆర్‌పి సిబ్బందితో సమీక్షించారు. కార్యక్రమంలో ఎంఇఒలు జి.జగదీష్‌, పి.బాలభాస్కరరావు, ప్రిన్సిపల్‌ ఆర్‌.ఈశ్వరరావు, ఎస్‌ఒ కిరణ్మయి, తదితరులు పాల్గొన్నారు.

➡️