ఆర్థిక లేఖలపై అవగాహన

Feb 6,2024 21:41
ఫొటో : మాట్లాడుతున్న అధికారులు

ఫొటో : మాట్లాడుతున్న అధికారులు
ఆర్థిక లేఖలపై అవగాహన
ప్రజాశక్తి-సీతారామపురం : మండలంలోని పొదుపు సంఘాల సమైక్య సభ్యురాల్లకు పొదుపు ఆర్థిక లేఖలపై మంగళవారం నాబార్డ్‌ ఎజిఎం రవిసింగ్‌, కెనరా బ్యాంక్‌ రీజనల్‌ అధికారి హుస్సేనయ్య, కెనరా బ్యాంక్‌ డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్‌ రవిశంకర్‌ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీతారామపురం ఫైనాన్సర్‌ లెటర్స్‌పై మహిళలకు పొదుపు సంఘాల వల్ల ఆర్థికంగా సామాజికంగా ఎదగాలనే ఉద్దేశంతో సంఘాలను పటిష్టపరుచుకుంటూ వారి ఆదాయంలో ఖర్చులు పోను మిగిలిన దానితో పొదుపు చేస్తూ ఒక్కో సభ్యురాలికి సుమారు లక్ష రూపాయలు నుండి రెండు లక్షల వరకు రుణాలు మంజూరు చేయడంలో కెనరా బ్యాంకు ముందంజలో ఉందన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలంటే వారు తీసుకున్న రుణాన్ని సక్రమమైన పద్ధతిలో ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలని, ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని వృథా ఖర్చులను తగ్గించుకోవాలని సక్రమమైన పద్ధతిలో పొదుపు చేస్తూ పంచ సూత్రాలను పాటిస్తూ ఆర్థికంగా ఎదగాలని దానికి కావాల్సిన ఫైనాన్షియల్‌ సపోర్టు బ్యాంకు ఇస్తుందన్నారు. ఉమెన్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పిఎంఎంఇజిఎస్‌ ద్వారా లక్ష రూపాయలకు రూ.35వేలు సబ్సిడీ వస్తుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిన్నచిన్న వ్యాపారాల ద్వారా కుటుంబాలను ఆర్థికంగా మెరుగుపరుచుకోవచ్చని కనీసం నెలకు రూ.10వేలు సంపాదించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో కెనరా బ్యాంకు మేనేజరు సందీప్‌, డిఆర్‌డిఎ వెలుగు ఎపిఎంబిడబ్ల్యూ సుధాకర్‌ రావు, సిసిలు, సంఘ బంధం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

➡️