ఆలయ నిర్మాణానికి విరాళం అందజేత

ప్రజాశక్తి-చీమకుర్తి : వైసిపి అద్దంకి నియోజకవర్గ పరిశీలకులు మారం వెంకారెడ్డి చర్చి, ఆలయాల నిర్మాణానికి విరాళం అందజేశారు. దేవరపాలెంలో నిర్మిస్తున్న చర్చి నిర్మాణానికి రూ.30 వేలు. చినగంజాం మండలం మున్నంగావారిపాలెంలో నిర్మిస్తున్న పోలేరమ్మ ఆలయ నిర్మాణానికి రూ.50,116 అందజేశారు. ఈ సందర్భంగా మారం వెంకారెడ్డి మాట్లాడుతూ మారం చినపేరిరెడ్డి చిన్నమ్మ ట్రస్టు ఆధ్వర్యంలో వివిధ రకాల సేవా కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్‌పిటిసి గంగిరెడ్డి ఓబులరెడ్డి, పాస్టర్లు అబ్రహం, గుత్తిరాజు, రవి,రమేష్‌, జార్జి, మరిదాసు, ఏసుబాబు,బి ఏసుదాసు, ఆనందరావు, ఏసోబు,కోటేష్‌ ,మున్నంగివారిపాలెం గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

➡️