ఇంటి వద్దకే పింఛన్లు దేశంలో ప్రథమం

Jan 7,2024 22:43 #పింఛన్లు
ఇంటి వద్దకే పింఛన్లు

ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్‌, కడియం దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సిఎం జగన్‌ వాలంటీర్‌ వ్యవస్థను ప్రవేశపెట్టి ఇంటి వద్దకే పెన్షన్‌ అందజేస్తున్నారని హోమ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ తానేటి వనిత అన్నారు. ఆదివారం కొవ్వూరు మున్సిపల్‌ పరిధిలో సంస్కత పాఠశాలలో నిర్వహించిన పెన్షన్ల పెంపు, నూతనంగా మంజూరైన వారికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె 88 మంది లబ్ధిదారులకు పెన్షన్‌ అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అవ్వాతాతలతో పాటు వితంతువులు, వివిధ రకాల చేతివృత్తిదారులకు నెలనెలా ఇచ్చే పెన్షన్‌ మొత్తం జనవరి నెల నుంచి రూ.మూడు వేలకు ప్రభుత్వం పెంచిన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్‌ పెంపు, నూతన పెన్షన్ల మంజూరైన వారికి పెన్షన్‌ పంపిణీ ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. పెన్షన్‌ పంపిణీలో తీసుకొచ్చిన మార్పులను ఆమె వివరించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మ్యానిఫెస్టోలో 99.9 శాతం హామీలను అమలు చేశామని, ఇచ్చిన హామీలనే కాకుండా.. ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత సిఎం జగన్‌కే దక్కుతుందన్నారు. ప్రతి ఇంటా పెద్దకొడుకుగా సిఎం జగన్‌ కుటుంబాలను సంరక్షిస్తున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. కడియం జెడ్‌పి హైస్కూల్‌ ప్రాంగణంలో ఆదివారం ఏర్పాటు చేసిన పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, నాయకులు దొంతంశెట్టి భద్రయ్య, తాడాల చక్రవర్తి, ఎంపిడిఒరత్నకుమారి పాల్గొన్నారు.

➡️