పదలపై ఫారెస్ట్‌ అధికారుల దౌర్జన్యం

పదలపై ఫారెస్ట్‌ అధికారుల దౌర్జన్యం ప్రజాశక్తి – వెంకటగిరి రూరల్‌తిరుపతి జిల్లా వెంకటగిరి మండలంలోని పెట్లూరు గ్రామ సర్వే నెంబరు 12 లో గత కొంతకాలంగా నిరుపేదలు చెట్టు పుట్ట చదును చేసుకుని, గుడిసెలు నిర్మించుకుని నివాసం ఉంటుంటే ఆ గుడిసెలను సోమవారం ఫారెస్ట్‌ అధికారులు దౌర్జన్యంగా తొలగించారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసు, ఫారెస్టు అధికారులు మహిళలని చూడకుండా గుడిసెలను, మహిళలను బలవంతంగా ఈడ్చేయడంతో గుడిసెవాసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు చెంగయ్య మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పేదలు ఈ భూమిని సాగు చేసుకుంటున్నారని, ఫారెస్టు అధికారులు జాయింట్‌ సర్వే పేరుతో 20 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిప్పుకుంటున్నారే తప్ప, పేదలకు న్యాయం చేయలేదన్నారు. ఇంటి స్థలాలు లేక పోవడంతో వీరంతా సిపిఎంను ఆశ్రయించారు. బడుగు బలహీన వర్గాలు వేసుకున్న గుడిసెలను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే ఎంతోకాలంగా పేదలు చేస్తున్న పోరాటానికి పరిష్కారం చూపి, భూములు పంచి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పేదలపై దౌర్జన్యం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ భూపోరాటంలో గుడిసె నిర్వాసితులు పాల్గొన్నారు. మేత పోరంబోకు భూమిని ఫారెస్టు అధికారులు తమదని చెప్పడం సరికాదన్నారు. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే జాయింట్‌ సర్వే చేయాలని డిమాండ్‌ చేశారు. అప్పటివరకూ ఈ భూములను వదిలేది లేదని హెచ్చరించారు.

➡️