ఇనమనమెళ్లూరులో ‘బాబు ష్యూరిటీ

‘ప్రజాశక్తి-మద్దిపాడు: మండల పరిధిలోని ఇనమనమెళ్లూరు గ్రామంలో గురువారం రెండోరోజు బాబు ష్యూరిటీ -భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సంతనూతలపాడు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ బిఎన్‌ విజరు కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లకు నియోజకవర్గంలో ఉన్నా నని, వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తనకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మండవ జయంత్‌ బాబు, అడకా స్వాములు, గ్రామ అధ్యక్షులు నైనాల భావన్నారాయణ, యూనిట్‌ ఇన్‌చార్జి దొప్పా శేషయ్య, జనసేన మండల అధ్యక్షు లు నున్న బాల సుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీటీసీ మందపల్లి శ్రీను, బూత్‌ ఇన్‌ఛార్జులు దొప్పా సుబ్బారావు, భీమవరపు శ్రీనివాసరావు, ఉప్పుగుండూరి వీరాంజనేయులు, గంగవరపు ప్రసన్న కుమార్‌, గంగోలు శ్రీను, గంగవరపు జోసఫ్‌, జనసేన అధ్యక్షులు గుద్దేటి సురేష్‌బాబు, మాదాసు ఉమామహేశ్వరరావు, నైనాల మురళీకృష్ణ, వెంకంశెట్టి అనిల్‌, సింగంశెట్టి హరికృష్ణ, రామిశెట్టి ప్రసాదరావు, గ్రామస్థులు పాల్గొన్నారు. పెద్దదోర్నాల: పెద్దదోర్నాల మండలంలోని హసనాబాద్‌ గ్రామంలో గురువారం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వంలో యువతను ఐటి ఉద్యోగులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా, పారిశ్రామికవేత్తలుగా చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. వైసీపీ ప్రభుత్వంలో యువతను మద్యం దుకాణాలలో చిరుద్యోగులను చేసిన ఘనత జగన్మోహన్‌రెడ్డిది అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్‌ ఏరువ మల్లికార్జునరెడ్డి, నాయకులు అంబటి వీరారెడ్డి, దొడ్డా శేషాద్రి, షేక్‌ మాబు తదితరులు పాల్గొన్నారు.

➡️