ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులను ఒప్పించాలి

Dec 23,2023 21:36

 ప్రజాశక్తి-సాలూరు  :  పేదల గృహ నిర్మాణంలో లబ్ధిదారులను ఒప్పించి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఐటిడిఎ పిఒ విష్ణుచరణ్‌ ఆదేశించారు. శనివారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ టి.జయరాం, హౌసింగ్‌ డిఇ సోమేశ్వరరావు, ఎఇలతో సమీక్ష నిర్వహించారు. అనంతరం నెలిపర్తి లేఅవుట్‌ని పరిశీలించారు. వివిధ స్థాయిల్లో నిలిచిపోయిన గృహ నిర్మాణాలు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. పునాదులు, శ్లాబ్‌ స్థాయిలో నిలిచిన ఇళ్ల లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని కోరారు. జగనన్న లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులు త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్‌ ఎఇలు తెంటు శ్రీనివాసరావు, సత్యనారాయణ, మున్సిపల్‌ ఎఇ సూరినాయుడు పాల్గొన్నారు.

➡️