ఇళ్ల రిజిస్ట్రేషన్‌ పత్రాల పంపిణీ

ఇళ్ల రిజిస్ట్రేషన్‌ పత్రాల పంపిణీ

 

ఇళ్ల రిజిస్ట్రేషన్‌ పత్రాల పంపిణీ

ప్రజాశక్తి- సీతమ్మధార: జివిఎంసి 24వ వార్డు పరిధిలోని 815 మంది లబ్ధిదారులకు జగనన్న ఇళ్ల రిజిస్ట్రేషన్‌ పత్రాలను స్థానిక కార్పొరేటర్‌ సాడి పద్మారెడ్డి ఆధ్వర్యంలో ఉత్తర నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కెకె.రాజు అందజేశారు. శుక్రవారం రేసపువానిపాలెం కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కెకె.రాజు మాట్లాడుతూ, పేదోడి సొంతింటి కలను సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌దేనన్నారు కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు జివి.రమణి పాల్గొన్నారు.47వ వార్డులో 358మంది లబ్ధిదారులకు స్థానిక కార్పొరేటర్‌, స్టాండింగ్‌ కమిటీ సభ్యులు కంటిపాము కామేశ్వరి ఆధ్వర్యంలో ఇళ్ల రిజిస్ట్రేషన్‌ పత్రాలను ఉత్తర నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కెకె రాజు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వార్డు నాయకులు వసంతల అప్పారావు, సుకుమార్‌, కె విజరు, రాఘవలు,గురువోజీ, కృపా, జారు లక్ష్మణ్‌, నర్సింగ్‌, సురేష్‌, చందు, భోగి జయకుమార్‌, రమేష్‌, నాగేశ్వరావు, గంగరాజు, భరత్‌వల్లి, కె.సాయి, తారాకేష్‌, రవి, అల ్లజగ్గీ సురేష్‌ పాల్గొన్నారు.26వవార్డులో జగ్గారావు బ్రిడ్జి సచివాలయం వద్ద వార్డు వైసిపి అధ్యక్షురాలు పీలా వెంకటలక్ష్మి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసిపి నేతలు బొడ్డేటి కిరణ్‌కుమార్‌, హరికృష్ణ, శ్యామల, పాండవ శ్రీనివాసరావు, రవి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.అనకాపల్లి డెస్క్‌:గొలుగొండ మండలం లోని చీడిగుమ్మల పంచాయతీలో శుక్రవారం జగనన్న ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సుర్ల వెంకట గిరిబాబు మాట్లాడుతూ, పేదల సొంతింటి కల వైసీపీ ప్రభుత్వ హయాంలోనే నెరవేరిందన్నారు. అర్హులైన పేదవారికి ఇళ్ల స్థలాలు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కాపారపు చినబ్బాయి, ఉప సర్పంచ్‌ కసిరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

లబ్ధిదారులకు పత్రాలను అందజేస్తున్న కెకె.రాజు

➡️