ఇవిఎంల భద్రతను సమీక్షించిన కలెక్టర్‌

Mar 26,2024 21:53

ప్రజాశక్తి-కలెక్టరేట్‌  : స్థానిక ఇవిఎం గోదాములను కలెక్టర్‌ నాగలక్ష్మి మంగళవారం తనిఖీ చేశారు. అక్కడి భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. గోదాములను తెరిపించి, నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన గదులను, ఇవిఎంలను పరిశీలించారు. అనంతరం మళ్లీ గోదాములకు సీళ్లు వేయించారు. గోదాముల్లోని సిసి కెమేరాలను తనిఖీ చేశారు. ఇవిఎంల తొలిదశ తనిఖీకి ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీల్లో జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, ఆర్‌డిఒ ఎంవి సూర్యకళ, ఎన్నికల విభాగం సూపరింటిండెంట్‌ ప్రభాకర్‌, నెల్లిమర్ల తాహశీల్దార్‌ రామరాజు, మున్సిపల్‌ కమిషనర్‌ బాలాజీ ప్రసాద్‌, రాజకీయ పార్టీల ప్రతినిధులు సముద్రాల రామారావు, కుటుంబరావు, గేదెల రాజారావు, తాలాడ సన్నిబాబు, పద్మనాభం, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️