ఈ క్రాప్‌ నమోదు: ఎఒ

ప్రజాశక్తి-అర్ధవీడు ఈ రబీ సీజన్‌లో మండలంలోని అన్ని గ్రామాలలో 5,728 ఎకరాల ఈ క్రాపింగ్‌ నమోదు చేశామని మండల వ్యవసాయ అధికారి ఎస్‌కె మహమ్మద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల ఈకేవైసీ 98 శాతం పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. మండలంలోని అన్ని గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల వద్ద సామాజిక తనిఖీలో భాగంగా రబీ 2023-24 సీజన్‌కు సంబంధించి ఈ క్రాప్‌ ముసాయిదా జాబితా 1 మార్చి 2024 తేదీ నుంచి 3 మార్చి 2024 వరకు సామాజిక తనిఖీ కోసం ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. కాబట్టి గ్రామసభలు కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ గ్రామసభలలో ఆర్బికే సిబ్బంది జాబితాలో ఉన్న రైతుల పేర్లు చదివి వినిపిస్తారన్నారు. రైతులు మీ రైతు భరోసా కేంద్ర పరిధిలో ఉన్న సామాజిక తనిఖీ కోసం ప్రదర్శించిన జాబితాను పరిశీలించి అభ్యంతరాలు ఏమైనా ఉన్నట్లయితే సవరణ కోసం మీ రైతు భరోసా కేంద్రంలో ఉన్న సిబ్బందికి రాతపూర్వకంగా తెలియజేయాలని కోరారు. తరువాత ఆర్బికే అధికారి అభ్యంతరాలు పరిశీలించి ధ్రువీకరించుకుని తహశీల్దారు ఆమోదానికి లోబడి ఆర్బికేల వారిగా ఈ నెల ఐదో తేదీ లోపల తుది జాబితాలో చేర్చుతామన్నారు. తరువాత ఎటువంటి సవరణలు చేయడం కుదరదని మండల వ్యవసాయ అధికారి ఎస్కే మహమ్మద్‌ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా రైతు భరోసా కేంద్ర పరిధిలోని రైతులు పాల్గొన్నారు.

➡️