ఉగ్రను కలిసిన వెలిగండ్ల టిడిపి నాయకులు

ప్రజాశక్తి-వెలిగండ్ల: కనిగిరి టిడిపి ఇన్‌ఛార్జి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అనకాపల్లి, విశాఖపట్నంలో స్థిరపడిన వెలిగండ్ల వాసులతో అనకాపల్లిలో గురువారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రాకపోతే రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కనిగిరి నియోజకవర్గంలో తన గెలుపునకు కృషి చేస్తే కనిగిరి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. డాక్టర్‌ ఉగ్రను కలిసిన వారిలో వెలిగండ్ల మండల టిడిపి నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త చిలకల కృష్ణారెడ్డి, దండగ చిన రంగారెడ్డి, నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.

➡️