బ్యాంకు సేవలపై అవగాహన

Jun 26,2024 19:09
బ్యాంకు సేవలపై అవగాహన

మాట్లాడుతున్న కోడూరు బ్యాంక్‌ శివకుమార్‌
బ్యాంకు సేవలపై అవగాహనప్రజాశక్తి-తోటపల్లిగూడూరు:బ్యాంకులు అందించే సేవలపై ఖాతాదారులు అవగాహన కలిగి ఉండాలని కెనెరా బ్యాంకు మేనేజర్‌ ఎం.శివ కుమార్‌ సూచించారు. బుధవారం లింకింగ్‌ యూత్‌ విత్‌ ఓకేషనల్‌ స్కిల్స్‌ కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమం జరిగింది. నోకియా సేవ్‌ ది చిల్డ్రన్‌ సంస్థ ఆర్థిక సహకారం తో బాలరక్ష భారత్‌లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మేనేజర్‌ శివకుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కెనరా బ్యాంక్‌ మేనేజర్‌ శివకుమార్‌ మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా అందే సేవల గురించి ఖాతా దారులు అవగాహన కలిగి వుండాలని తెలిపారు. వెలు గు సీసీ రవీంద్ర గపొదుపు మహిళలకు అందించే ఈ స దుపాయాలు పథకాలు గురించి అవగాహన కల్పించారు. ఆర్‌ఎస్‌ఈటిఐ నుంచి అందించే వివిధ ఒకేషనల్‌ స్కిల్‌ శిక్షణ గురించి తెలియపరిచారు. వెల్ఫేర్‌ ప్రసన్న లక్ష్మి (వెంకన్నపాలెం) అందించే సేవలు గురించి తెలియ జేయడం జరిగింది. ఆర్‌బిఐ నుండి విచ్చేసిన ప్రశాంతి సైబర్‌ నేరాల గురించి, సామాజిక భద్రత కార్యక్ర మాలు గురించి తెలియజేశారు. సేవ్‌ ది చి ల్డ్రన్‌ నుంచి విచ్చేసిన సూపర్‌వైజర్‌ రమణయ్యతో ఒకే షనల్‌ ట్రైనింగ్‌ గురించి, అవి పొందిన తరువాత అవకాశాల గురించి తెలియపరిచారు.కార్యక్రమంలో సేవ్‌ ది చిల్డ్రన్‌ సిఎఫ్‌ పద్మావతి, సిఏఐ సునీత, ఇతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

➡️