ఉద్యమ సంఘీభావ నిధి అందజేత

ప్రజాశక్తి-చీమకుర్తి : ఉపాధ్యాయ హక్కులు, విధులతోపాటు సేవాధృక్పధాన్ని కొనసాగిస్తున్న యుటిఎఫ్‌ సేవలు అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు. స్థానిక దాచూరిరామిరెడ్డి భవనంలో సమగ్ర శిక్ష అభియాన్‌ సిబ్బంది, అంగనవాడీ కార్యకర్తలు, మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఉద్యమ సంఘీభావ నిధి శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ మండల అధ్యక్ష8ుడు ఎస్‌కె.అక్బర్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎంఇఒలు వెంకటేశ్వరరెడ్డి, శివాజీ మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా వేతనాలు అందక ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది ఇబ్బందులు పడతున్నారని తెలిపారు. యుటిఎఫ్‌ అందించిన సహాయం వారికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. జెవివి జిల్లా గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ బి జవహర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి యుటిఎఫ్‌ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పండుగ వేళ ఎస్‌ఎస్‌ఏ సిబ్బందికి, మున్సిపల్‌ కార్మికులకు, అంగనవాడీలకు యుటిఎఫ్‌ సహాయం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. వీరాంజనేయులు మాట్లాడుతూ హక్కులను,భాధ్యతలను యుటిఎఫ్‌ సమానంగా తీసుకుంటుందన్నారు. అనంతరం సర్వశిక్షా అభియాన్‌ సిబ్బందికి రూ.81,000 నిధి నుంచి సమగ్ర శిక్ష ఉపాధ్యాయులు రూ.30,000, మున్సిపల్‌ వర్కర్స్‌యూనియన్‌(సిఐటియు)కు రూ.10,000, అంగనవాడీ వర్కర్స్‌ యూనియన్‌(సిఐటియు)కు రు.10, 000 విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా కోశాధికారి చిన్నస్వామి, జిల్లా కార్యదర్శి నల్లూరివెంకటేశ్వరరావు,మండల అధ్యక్షుడు అక్బర్‌, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కోశాధికారి పర్వతం వెంకటేశ్వర్లు, గౌరవాధ్యక్షుడు వి.వసంతరావు, గోనుగుంట స్కూల్‌ కాంప్లెక్స్‌ చైర్మన్‌ బండి శ్రీనివాసరావు, జిల్లా నాయకులు శిలార్‌, చల్లా శ్రీను, మన్నం సుబ్బారావు, దేవదాసు, బ్రహ్మయ్య, రమేష్‌,భాస్కర్‌, వీరారెడ్డి, వెంకటరావు, చాట్లశ్రీను, కోటేశ్వరరావు, ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, సిఐటియు నాయకులు పూసపాటి వెంకటరావు,జెవివి కార్యదర్శి చలువాది రమేష్‌ పాల్గొన్నారు.

➡️