ఉద్యోగావకాశాలు పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు

ఆన్లైన్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌ వెబ్సైట్‌ పోర్టల్‌ ప్రారంభిస్తున్న జెసి

ప్రజాశక్తి-అమలాపురం

యువతకు ఉద్యోగావకాశాలు పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసిందని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నుపూర్‌ అజరు పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌ నందు ఆన్లైన్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌ వెబ్సైట్‌ పోర్టల్‌ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాల సమాచారం తెలుసుకుని ఆన్లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే విధంగా కొత్త వెబ్‌ సైట్‌ పోర్టల్‌ అందు బాటులోకి తీసుకొచ్చిందన్నారు. ఆన్లైన్లో ఎంప్లాయ్మెంట్‌ ఎక్స్చేంజ్‌ వెబ్సైట్‌ ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసిందన్నారు.. ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి అవకాశాల సమాచారం. తెలుసుకుని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. గతంలో ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌ నమోదులో సీనియార్టీని బట్టి ఉద్యోగాల భర్తీ జరిగేదన్నారు. ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వెబ్‌ పోర్టల్‌ లు అభివద్ధి చేయడం యువతకు ఎంతో ఉపయోగపడు తుందన్నారు. టెన్త్‌ దగ్గర నుంచి డిగ్రీ, వరకు డిప్లమో ఏది చేసినా సరే ఈ పోర్టల్‌ లో నమోదు చేసుకోవడం ద్వారా అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలు వెంటనే తెలుసుకోవచ్చన్నారు. ఎంప్లాయిమెంట్‌ కార్డు లాగిన్‌ ద్వారా డౌన్‌ లోడ్‌ చేసుకునే సదుపాయం కల్పించినట్లు తెలిపారు. జిల్లా ఉపాధి కల్పనాధికారి వసంతలక్ష్మి మాట్లాడుతూ ఇంజనీరింగ్‌, ఎంబీఏ, డిగ్రీ కోర్సులు సహా ఐటీ, టెక్నికల్‌ రంగాలకు యువత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో వారి అవసరాలకు పెద్దపీట వేస్తూ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌ వెబ్‌ పోర్టల్‌ రూపొందించినట్లు తెలిపారు. ఆధార్‌ ఫోన్‌ నంబర్‌ ద్వారా లాగిన్‌ అయి విద్యార్హతల వివరాలను పోర్టల్లో నమోదు చేయగానే మొబైల్‌ సందేశంగా వస్తుందన్నారు. అభ్యర్థుల వివరాలు జిల్లాస్థాయి అధికారికి చేరి, వారి ఆమోదంతో ఎంప్లాయిమెంట్‌ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ తెలియజేస్తారన్నారు. జిల్లాలో గల నిరుద్యోగ అభ్యర్థులకు ఆన్లైన్‌ లో సేవలు, ఎంప్లాయిమెంట్‌ రిజిస్ట్రేషన్‌, రెన్యువల్‌ అదనపు అర్హతలు నమోదు సులభరీతిన %వఎజూశ్రీశీyఎవఅ్‌. aజూ.స్త్రశీఙ.ఱఅ% వెబ్‌ పోర్టల్‌ ద్వారా అందచేయబడిందన్నారు. పైన తెలిపిన సేవలు జిల్లా ఉపాధి కార్యాలయం, మోడల్‌ కెరీర్‌ సెంటర్లు, ఇంటర్నెట్‌ సెంటర్లు మొబైల్‌ ద్వారా కూడా తాము ఉన్న చోట నుంచే సులభంగా పొందవచ్చును. అభ్యర్థి తన ఎంప్లాయిమెంట్‌ కార్డును లాగిన్‌ ద్వారా డౌన్లోడ్‌ చేసుకునే సదుపాయం కలదన్నారు. ఇది వరకు జిల్లా ఉపాధి కార్యాలయంలో ఎంప్లాయిమెంట్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉన్న అభ్యర్థులు మీ పాత ఎంప్లాయిమెంట్‌ కార్డు నంబరుతో వివరాలను సరి చూసుకుని మీ యొక్క కొత్త ఎంప్లాయిమెంట్‌ కార్డును పొందవచ్చన్నారు. పైన తెలిపిన సేవలను బుధవారం నుంచి వినియోగించుకోవలసినదిగా అభ్యర్థులకు తెలియజేశారు. ఇతర సహాయం కొరకు కార్యాలయ పనివేళలో 10.30 గంటల నుంచి 5 గంటల వరకు సెల్‌ నెం.8121838392లో సంప్రదించగలరన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్‌. సత్తిబాబు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

 

➡️