ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

ప్రజాశక్తి-కడప అర్బన్‌ ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వంతో చర్చించి త్వరలో పరిష్కారానికి కృషి చేస్తామని ఎపిఎన్‌జిఒ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వి. శివారెడ్డి, సి.హెచ్‌.పురుషోత్తం నాయుడు అన్నారు. బుధవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం జిల్లా అధ్యక్షులు బి.శ్రీనివాసులు, డి.రవికుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ఇరిగేషన్‌ కాంపౌండ్‌ నుంచి కోటిరెడ్డి సర్కిల్‌, సంధ్య సర్కిల్‌ మీదుగా జడ్పీ సమావేశ మందిరం వరకు ర్యాలీ నిర్వ హించారు. రాష్ట్ర అధ్యక్షులు శివారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి మనకు రావలసిన అన్ని డిమాండ్స్‌ త్వరగా పరిష్కరిస్తామన్నారు. 12 పిఆర్‌సి, పెండింగ్‌ డిఎలు, జిపిఎఫ్‌, ఎపిజిఎల్‌ఐ పెండింగ్‌ బిల్లులు, పెన్షనర్స్‌ సమస్యలు, సరండర్‌ లీవ్‌, ఉపాధ్యాయ, వైద్య ఆరోగ్య ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారం చేస్తామని పేర్కొన్నారు. ఎపిఎన్‌జిఒ జిల్లా అధ్యక్షులు బి.శ్రీనివాసులు మాట్లాడుతూ కె.వి.శివారెడ్డి 1985 నుంచి ఎన్‌జిఒ ఉపాధ్యక్షులుగా సంఘంలో చేరి, జిల్లా కోశాధికారిగా, సెక్రటరీ, 12 సంవత్సరాలు కడప జిల్లా అధ్యక్షులుగా ఉంటూ పోరాట యోధుడిగా అనేక ఉద్యోగుల సమస్యలు పరిష్కరించారని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగికి ఆత్మీయ బంధువుగా ఉంటూ మంచి పేరు సంపాదించారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మూడు సంవత్సరాలు పనిచేసి, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల మద్దతుతో ఏకగ్రీవంగా రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికయ్యారని చెప్పారు. ఎపిజెఎసి చైర్మన్‌గా ఎన్నుకున్నారని తెలిపారు. లక్షలాది మంది ఉద్యోగుల డిమాండ్స్‌ సాధన కోసం కృషి చేస్తాడనే నమ్మకం అందరికి ఉందన్నారు. సి.హెచ్‌.పురుషోతం నాయుడు ప్రధాన కార్యాదర్శిగా సమర్థ వంతమైన నాయకత్వాన్ని పోషిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సహాధ్యక్షులు దస్తగిరిరెడ్డి, ఉపాధ్యక్షలు వై.ప్రసాద్‌ యాదవ్‌, కోశాధికారి రంగారావు, రాష్ట్ర కార్యదర్శలు జగదీష్‌, కృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, రంజిత్‌ నాయుడు, రాంప్రసాద్‌, కర్నూల్‌, చిత్తూరు, అనంతపురం జిల్లాల అధ్యక్షులు వెంగల్‌రెడ్డి, రాఘవులు, చంద్రశేఖర్‌రెడ్డి, కార్యదర్శి చంద్రమోహన్‌, జిల్లా నాయకులు, జడ్‌పి రాష్ట్ర అధ్యక్షులు నాగిరెడ్డి, జిల్లా అధ్యక్షులు మల్లేశ్వర్‌రెడ్డి, ఆర్‌టిసి రాష్ట్ర నాయకులు శివారెడ్డి, నాగముని, పెన్షనర్లు అధ్యక్షులు చెన్నారెడ్డి, అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ తిమ్మారెడ్డి, ఉపాధక్షులు శ్రీనివాసులు, నరసింహారెడ్డి, బాలపుల్లయ్య, జాయింట్‌ సెక్రెటరీ పోలీరెడ్డి, జయలక్ష్మి, ట్రెజరర్‌ నిత్యపూజయ్య, సిటీ అధ్యక్షులు చిన్నయ్య, సెక్రెటరీ శైలేశ్వరరెడ్డి, అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాసన్‌, ఉపాధ్యక్షులు పద్మనాభం, రాజగోపాల్‌రెడ్డి, చాందుబాషా, జాయింట్‌ సెక్రెటరీ, మోహన్‌రెడ్డి, శుభాషిణి, రాజు, బాదుల్ల, జిల్లాలోని అన్ని తాలూకా అధ్యక్షులు, కార్యదర్శులు, ఎన్‌జిఒ నాయకులు పాల్గొన్నారు.

➡️