ఉన్నత విద్య విధానాలపై విద్యార్థులకు అవగాహన

ప్రజాశక్తి-శింగరాయకొండ : టంగుటూరు మండలం వల్లూరు సమీపంలో రైజ్‌ కష్ణ సాయి ప్రకాశం గ్రూప్‌ విద్యాసంస్థలో ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా విధానాలపై విద్యార్థులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించినట్లు కళాశాల సెక్రెటరీ శిద్దా హనుమంతరావు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఉపాధ్యక్షుడు, రాష్ట్ర క్వాలిటీ ఎష్యురెన్సు సెల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కె.రామమోహన్‌రావు ఇంజినీరింగ్‌ నుంచి పైస్థాయి విద్య వరకూ రాష్ట్రప్రభుత్వం హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ద్వారా అమలు చేస్తున్న విద్యా విధానాల (విద్యార్థి నైపుణ్యాభివద్ధి, ఇంటెర్షిప్స్‌, కమ్యూనిటీ సర్వీస్క్రాజెక్టు) గురించి వివరించినట్లు తెలిపారు. విదేశీ విద్యాలయాలు పరస్పర ఒప్పందం తదితర అంశాలపై సమగ్ర వివరణ మరియు ఎసిఎస్‌సిహెచ్‌ఇ మెసెంజర్‌ యాప్‌ ద్వారా విద్యార్థుల వ్యక్తిగత నైపుణ్యత, సెల్ఫ్‌ స్టడీ, కెరియర్‌ నిర్ధారణ అంశాలను గురించి వివరించినట్లు కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ ఎవి.భాస్కరరావు తెలిపారు. ఈ కార్యక్ర మంలో విద్యార్థులు, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

➡️