‘ఉపాధి’ సిబ్బందికి శిక్షణ

Jan 3,2024 19:56
మాట్లాడుతూన్న ఎపిఎం

మాట్లాడుతూన్న ఎపిఎం
‘ఉపాధి’ సిబ్బందికి శిక్షణ
ప్రజాశక్తి – లింగసముద్రం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో బుధవారం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం మహిళ మేట్లకు మూడు రోజుల శిక్షణ తరగతులలో భాగంగా మూడో రోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. మస్టర్ల నిర్వహణ, కొలతలపై అవగాహన కల్పించినట్లు ఎపిఎం సమీర్‌బాషా చెప్పారు. ఇక్కడ తెలుసుకున్న విషయాలను పనులు జరిగే ప్రదేశాల్లో అందరికి చెప్పాలని వివరించారు. కార్యక్రమంలో ఈసి చిన కోటయ్య, బిఎఫ్‌టి జక్రయ్య,టిఎలు రాజ్‌కుమార్‌,జివి రాఘవులు ,కె.మహేంద్ర, ఫీల్డ్‌అసిస్టెంట్‌లు ఉన్నారు.

➡️