ఉపాధ్యాయుల బకాయిలు విడుదల చేయాలి

Dec 27,2023 21:53
ఫొటో : తహశీల్దారుకు వినతిపత్రం అందజేస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

ఫొటో : తహశీల్దారుకు వినతిపత్రం అందజేస్తున్న యుటిఎఫ్‌ నాయకులు
ఉపాధ్యాయుల బకాయిలు విడుదల చేయాలి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ఉపాధ్యాయులు ఉద్యోగులకు రావాల్సిన పిఆర్‌సి బకాయిలను వెంటనే విడుదల చేయాలని యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు బి.శివప్రసాద్‌ పేర్కొన్నారు. బుధవారం ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఆత్మకూరు, ఎఎస్‌పేట, మర్రిపాడు, అనంతసాగరం, మండలాలతో కలుపుకొని ఉపాధ్యాయులకు ఉద్యోగులకు రావాల్సిన పి.ఆర్‌.సి బకాయిలు, డిఎ బకాయిలు, ఎపిజిఎల్‌ఐ లోన్లు బకాయిలు, పిఎఫ్‌ బకాయిలు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని కోరుతూ తహశీల్దారుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం తహశీల్దార్‌ కార్యాలయం నుండి బిఎస్‌ఆర్‌ సెంటర్‌ వరకు ఉపాధ్యాయుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం బిఎస్‌ఆర్‌ సెంటర్‌లో 6గంటల సమయంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు బి శివప్రసాద్‌, జిల్లా కార్యదర్శి ఎం.గంగాధరం, మహిళా అసోసియేట్‌ అధ్యక్షురాలు ఎస్‌ వి ప్రసూన, ఎఎస్‌పేట యుటిఎఫ్‌ అధ్యక్షులు సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి వరప్రసాద్‌, జిల్లా ఆడిట్‌ కమిటీ మెంబర్‌ మల్లికార్జున, అనిత, తబిత రాణి, అనంతసాగరం మండలం అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి, కే పెంచలయ్య, మర్రిపాడు మండలం యుటిఎఫ్‌ మండల అధ్యక్షులు సుధాకర్‌ యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️