ఎంఎల్‌ఎకు సిఐటియు నాయకుల వినతి

Feb 23,2024 21:36
ఫొటో : ఎంఎల్‌ఎకు వినతిపత్రం అందజేస్తున్న సిఐటియు నాయకులు

ఫొటో : ఎంఎల్‌ఎకు వినతిపత్రం అందజేస్తున్న సిఐటియు నాయకులు
ఎంఎల్‌ఎకు సిఐటియు నాయకుల వినతి
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : పట్టణ జనాభా అవసరాల మేరకు పారిశుధ్య కార్మికులను పెంచాలని కోరుతూ శుక్రవారం సిఐటియు నాయకులు ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కావలి మున్సిపాలిటీలో గతంకంటే జనాభా పెరిగినందున పారిశుధ్య కార్మికులు అవసరం ఉందని, తక్కువ మంది పారిశుధ్య కార్మికులు పనులు చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా చనిపోయిన కార్మికులు, రిటైర్డ్‌ అయిన కార్మికులు, స్థానాల్లో ఖాళీలు ఏర్పడ్డాయని దానివల్ల తోటి కార్మికులకు పనిభారం పెరిగిందని కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ప్రజా ఆరోగ్యం కోసం ప్రాణాలను కూడా ఫణంగా పెట్టి తక్కువ జీతాలతో డైలీ కార్మికులుగా పనులు చేసి ప్రజారోగ్యాన్ని కాపాడారన్నారు. ఇప్పటికే డెయిలీ కార్మికులుగా తక్కువ జీతాలతో పనులు చేస్తున్నారని తెలిపారు. ఏర్పడిన ఖాళీలలో ప్రస్తుతం చేస్తున్న డైలీ కార్మికులను నియమించాలని ఆ తరువాత తగినంత మంది పారిశుధ్య కార్మికులను నియమించాలని ఎంఎల్‌ఎను కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు పసుపులేటి తిరుపాలు, వై.కృష్ణమోహన్‌, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు బిడదల మహేష్‌, ఒంగోలు రమేష్‌, పరుసు జేమ్స్‌, శివకోటయ్య, పోలయ్య, తదితరులు పాల్గొన్నారు.

➡️