ఎంఎల్‌ఎ చంటిబాబు ఇంటిని ముట్టడించిన అంగన్‌వాడీలు

Dec 27,2023 14:45
అంగన్‌వాడీలు

ప్రజాశక్తి – జగ్గంపేట రూరల్‌

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిర్వహిస్తున్న సమ్మె బుధవారం 16వ రోజుకు చేరుకుంది. దీనిలో భాగంగానే మండలంలోని ఇర్రిపాకలో స్థానిక ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు ఇంటిని అంగన్‌వాడీలు ముట్టడించారు. జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి మండలాల అంగన్‌వాడీ వర్కర్లు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీలు మాట్లాడుతూ 16 రోజులైనా అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎంఎల్‌ఎ ఇంటి వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు సుజాత, రత్నం, అనంతలక్ష్మి, గంగాభవాని, రాజేశ్వరి, సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.

➡️