ఎఒబి చెక్‌ పోస్టు తనిఖీ

Mar 7,2024 21:08

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : మండలంలోని ఆంధ్రా – ఒడిశా సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన అడారు చెక్‌ పోస్ట్‌ను గురువారం ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఒడిశా నుంచి నాటుసారా, గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టి అన్ని రకాల వాహనాలను తనిఖీ చేయాలని చెప్పారు. చెక్‌ పోస్ట్‌ సిబ్బంది అప్రమత్తంగా వుండి అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అనుమానం ఉన్నా, ముందస్తు సమాచారం వున్నా తక్షణమే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని తెలిపారు.

➡️