ఎన్నికల నిబంధనలు పాటించాలి

Mar 20,2024 22:06
ఫొటో : మాట్లాడుతున్న ఆర్‌డిఒ కె.మధులత

ఫొటో : మాట్లాడుతున్న ఆర్‌డిఒ కె.మధులత
ఎన్నికల నిబంధనలు పాటించాలి
ప్రజాశక్తి-ఆత్మకూరుఅర్బన్‌ : కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగులు, వలంటీర్లు రాజకీయ నాయకులతో పర్యటిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆత్మకూరు ఆర్‌డిఒ కె.మధులత పేర్కొన్నారు. బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలోని ఆర్‌డిఒ ఛాంబర్‌లో విలేకరులతో మాట్లాడాతూ చేజర్ల, సంగం, ఎఎస్‌పేట మండలాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో ముగ్గురు వలంటీర్లు ఒక విఆర్‌ఒ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు తెలియడంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు వారిని సస్పెండ్‌ చేసినట్లు తెలియజేశారు. ఆత్మకూరు నియోజకవర్గంలో 278 పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించినట్లు అందులో 66 కేంద్రాలను గతంలో జరిగిన ఎన్నికల్లో సంఘటనలను దృష్టిలో ఉంచుకొని సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినట్లు ఆమె తెలిపారు. ఫారం 12 ద్వారా నియోజకవర్గంలో మొత్తం 1428 ఓట్లు డిలీట్‌ చేసినట్లు ఆమె తెలిపారు. నాలుగు పోలింగ్‌ కేంద్రాలను అదే ప్రాంతాలంలోని సౌకర్యాలున్న ఇతర భవనాల్లోకి మార్చినట్లు తెలిపారు. పాతపాడు ఓబులాయపల్లి, కండ్రిక కేంద్రాలను సమీపంలోని భవనాల్లోకి మార్పు చేశారు. అలాగే గొల్లపల్లిలోని ప్రభుత్వ భవనం బాగా లేకపోవడంతో అంగన్‌వాడీ కేంద్రంలోకి మార్పు చేశామన్నారు. ఆ కేంద్రాల్లో ఎన్నికల పోలింగ్‌ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను వెబ్‌ కాస్టింగ్‌లో చిత్రీకరించినన్నట్లు తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి తొలుత జిల్లా కేంద్రాలలో మొదట శిక్షణ అనంతరం డివిజన్‌ కేంద్రమైన ఆత్మకూరులోని రెండవ శిక్షణ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో శిక్షణ ఉంటున్నట్లు ఆమె తెలిపారు. మే 13వ తేదీ పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్సులను తొలుత మున్సిపల్‌ పరిధిలోని ఆంధ్ర ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసి భద్రపరిచి అన్ని పిఎస్‌ల నుంచి పోలింగ్‌ బ్యాలెట్లు బాక్సులు చేరిన అనంతరం పటిష్టమైన బందోబస్తు మధ్య నెల్లూరులోని కనుపర్తిపాడు వద్ద ఉన్న ప్రియదర్శిని ఇంజనీరింగ్‌ కాలేజీలోని స్ట్రాంగ్‌ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వివరించారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో నిర్భయంగా ఓటు ప్రశాంతంగా వేయాలని ఆమె తెలిపారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కట్టుతిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

➡️