ఎన్నికల నియమావళి కట్టుదిట్టం : కలెక్టర్‌

ప్రజాశక్తి – రాయచోటి ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించి జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమాలని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌ కిశోర్‌ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాకు వివరించారు. మంగళవారం సాయంత్రం విజయవాడలోని రాష్ట్ర ప్రధాన ఎన్ని కల అధికారి కార్యాలయం నుంచి సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ అయిన ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా ప్రభుత్వ, ప్రయి వేటు భవనాలు, వాణిజ్య స్థలాల్లో రాజకీయ ప్రకటనలు, గోడ రాతలు, జెండాలు, పోస్టర్లు, పెద్ద పెద్ద హార్డింగ్స్‌, కటౌట్స్‌ తొలగింపులకు తీసుకోవాల్సిన చర్యలు, స్టాటిక్‌ సర్వైవలెన్స్‌ టీమ్‌ల పనితీరు, పోలింగ్‌ పర్సన్స్‌ రాండమైజేషన్‌, డ్రై రన్‌, ప్రథమ శిక్షణ, ఇవిఎంల మొదటి, రెండవ దశ ర్యాండమైజేషన్‌ ప్రక్రియ, సి విజిల్‌ యాప్‌ ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలలో జిల్లా ఎన్నికల అధికా రులతో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించి పలు అంశాలలో దిశా నిర్దేశం చేశారు. రాయచోటి కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫ రెన్స్‌ హాల్‌ నుంచి కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌ కిశోర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మన్‌ అహ్మద్‌ ఖాన్‌, డిఇఒసత్యనారాయణ రావు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రాంగణాల్లో, వాణిజ్య స్థలాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టరులు, బ్యానర్లను అనుమతించవద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున నూతన అనుమతులను ఏమాత్రం ఇవ్వరాదన్నారు. వీడి యో కాన్ఫరెన్స్‌ అనంతరం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు అధికారులతో మాట్లా డుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాలను దష్టిలో ఉంచుకొని బోర్డర్‌ చెక్‌ పోస్ట్‌ల్లో వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా తగు పర్యవేక్షణ చేయాలన్నారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బందాలు క్షేత్రస్థాయిలో విస్తతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలుపరచడం, ఎలక్ట్రానిక్‌ సీజర్‌ మేనేజ్మెంట్‌ సిస్టంను విస్తత స్థాయిలో వినియోగించాలని చెప్పారు. సి విజిల్‌ ద్వారా అందే ఫిర్యాదులపై తక్షణం స్పందించి సకాలంలో పరిష్కరించాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ ఎన్నికల నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

➡️