ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు : కలెక్టర్‌

ప్రజాశక్తి-రాయచోటి సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై పటిష్ట ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ నోడల్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని స్పందన హాల్లో సాధారణ ఎన్నికల నిర్వహణపై నోడల్‌ అధికారులు, అర్‌ఒలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు నోడల్‌ అధికారులు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పోలింగ్‌ విధుల నిర్వహణకు సిబ్బందిని సమకూర్చుకోవడంతోపాటు గైర్హాజరు కాకుండా రిజర్వు సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పోలింగ్‌ సిబ్బంది, మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీమ్స్‌, స్టాటిస్టిక్‌ సర్వైలెన్స్‌ టీమ్స్‌, వీడియో సర్వైలెన్స్‌ టీమ్స్‌, వీడియో వ్యూవింగ్‌ తదితర అన్ని రకాల ఏర్పాట్లు పక్కాగా ఉండేటట్లు చూడాలన్నారు. డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో పోలింగ్‌ మెటీరియల్‌ సరఫరా లోటుపాట్లు లేకుండా చూసుకోవాలన్నారు. జిల్లాలోని ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ను ఒకటి రెండుసార్లు విసిట్‌ చేసి లొకేషన్స్‌ గుర్తించాలన్నారు. బిఎల్‌ఒలు తమకు కేటాయించిన విధులను పక్కాగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జెసి ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, ఎఎస్‌పి డాక్టర్‌ రాజ్‌ కమల్‌, డిఎఫ్‌ఒ శుభం, డిఆర్‌ఒ సత్యనారాయణ, నోడల్‌ అధికారులు, ఆర్‌ఒలు పాల్గొన్నారు.కలసికట్టుగా పనిచేసి ఎన్నికలను విజయవంతం చేద్దాం ఎన్నికలకు కేటాయించిన సిబ్బంది కలసికట్టుగా పనిచేసి ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలని ఎన్నికల అధికారి అభిషిక్త్‌ కిషోర్‌ పేర్కొన్నారు. సాయి ఇంజినీరింగ్‌ కళాశాలలో స్వీప్‌ కార్యక్రమాలు, ఎంసిసి, ఎంసిఎంసి, ఇవిఎంల నిర్వహణ, ఎన్నికల సంఘం రూపొందించిన మొబైల్‌ యాప్స్‌, తదితర అంశాలపై ఆర్‌ఒలు, ఎఇఆర్‌ఒలు, డిటిలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు తదితర ఎన్నికల సిబ్బందికి సంబంధిత నోడల్‌ అధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల విధులకు కేటా యించిన డిప్యూటీ తహశీల్దార్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎన్నికలలో కీలకపాత్ర పోషించబోతున్నారన్నారు. వీరం దరూ వారికి కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించినప్పుడే ఎన్నికల ప్రక్రియ విజయవంతం అవుతుందన్నారు. ఆర్‌ఒలు, తహిశీలార్దులు తమకు కేటాయించిన లాగిన్లను చాలా జాగ్రత్తగా వాడుకోవాలన్నారు. స్వీప్‌ కార్యక్రమాల నోడల్‌ అధికారి రాజశేఖర్‌ రెడ్డి, ఎంసిసి నోడల్‌ అధికారి గురుప్రకాష్‌, పోస్టల్‌ బ్యాలెట్‌, ఇవిఎం నోడల్‌ అధికారులు జయరాముడు, మద్దిలేటి, ఎన్నికల సిబ్బం దికి అవగాహన కల్పించారు. నామినేషన్ల ప్రక్రియపై ఆర్‌డిఒ రంగస్వామి, భారత ఎన్నికల సంఘం రూపొందించిన మొబైల్‌ అప్లికేషన్లపై సమాచార సాంకేతికత నోడల్‌ అధికారి హరికష్ణ అవగాహన కల్పించారు.

➡️