ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్‌

Feb 29,2024 21:18
ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్‌

ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌
ప్రజాశక్తి -నెల్లూరు
ఎన్నికల నిర్వహణ కోసం నియమింపబడిన నోడ్‌ల్‌ అధికారులు పూర్తి స్థాయిలో ఎన్నికల విధులపై ప్రత్యేక దష్టి పెట్టాలని కలెక్టర్‌ ఎం .హరి నారాయ ణన్‌ సూచించారు .గురువారం తిక్కన ప్రాంగణంలో ఎన్నికల నోడల్‌ అధి కారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ హరి నారాయణన్‌ మాట్లాడుతూ నోడల్‌ అధికారులు చేయాల్సిన పనులకు సంబం ధించి చెక్‌ లిస్టు తయారు చేసుకుని ఆ ప్రకారం పని చేయాలన్నారు. ఎన్నికలు పకడ్బంధీగా నిర్వహించడానికి సెంట్రల్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. సోమవారం నుంచి నగరపాలక సంస్థ కార్యాలయంలో 24/7 కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తున్నామని,అందుకు అనుగుణంగా ప్రతి నోడల్‌ అధికారికి సంబంధించి. 3 షిఫ్టుల్లో సిబ్బంది నియమించుకోవాలన్నారు. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారం, సమస్యలు కంట్రోల్‌ రూమ్‌ కు తెలియజేస్తారని సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్‌ఓ ఎస్‌. లవన్న, నోడల్‌ అధికారులు బాపురెడ్డి, సుస్మిత రెడ్డి, కన్నమ నాయుడు ,పద్మావతి, సురేష్‌ తిరు పతయ్య, పలువురు పాల్గొన్నారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి టీం అధికారులు, సిబ్బం దితో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంఘం నిబంధనలు అర్థం చేసుకొని ఎన్ని కల విధుల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని సూచిం చారు. డీఈఓ టీం ,నోడల్‌ అధికారులతో సంప్రది స్తూ ఎన్నికల సంఘానికి పంపాల్సిన నివేదికలను సేకరించి నిర్ణీత సమయంలో ముఖ్య ఎన్నికల నిర్వహణ అధికారి కార్యాలయానికి పంపించడంలో సహకరించాలన్నారు. ఈ సమావేశంలో డిఆ ర్‌ఒ లవన్న, కలెక్టరేట్‌ ఏవో శర్మ ఎలక్షన్‌ తాసిల్దార్‌, సుబ్రహ్మణ్యం, పలువురు తాసిల్దార్లు, డిటిలు సీనియర్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు

➡️