ఎన్నికల నిర్వహణపై సమీక్ష

పల్నాడు జిల్లా: జిల్లా స్థాయిల్లో శాశ్వత ప్రాతిపదికన ఉన్న రాజకీయ పార్టీల కార్యాలయాల్లో స్థానిక చట్టాలు, అనుమతుల మేరకు ప్రస్తుతం ఉన్న రాజకీయ ప్రకటనల హోర్డింగులను తొలగించకుండా కొన సాగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదే శించారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లును, ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా అమలు తీరును సమీక్షించారు. ఈ సమీక్షలో నరసరావుపేట లోని కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌హాల్‌ నుండి పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మంగళవారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర సచివాలయంలో సమావేశం నిర్వహించిన సందర్బంగా పార్టీల శాశ్వత కార్యాలయాల్లో హోర్డింగులను తొలగించడంతో పాటు పలు సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చినట్లు చెప్పారు.ముందుగా అనుమతి పొందిన అనంతరం ఇంటింటి ప్రచారానికి వెళ్లాలనే నిబంధన అమలు దుస్సాధ్యమని, ఈ నిబంధనను పున: సమీక్షించాలని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరారన్నారు. ఈ అంశంపై త్వరలోనే సరైన నిర్ణయం తీసుకొని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు తెలియజేయడం జరుగు తుందని తెలిపారు.

 

వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల మేరకు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సం స్థలకు చెందిన వాణిజ్య స్థలాలతో పాటు కార్యా లయాల్లో కూడా ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టరులు, బ్యానర్లను అనుమతించ వద్దన్నారు. ప్రస్తుతం జాతీయ, ప్రధాన రహదారుల పక్కనున్న హార్డింగులను అన్ని రాజకీయ పార్టీలకు సమాన ప్రాతిపదికన కేటాయిచాలని, నూతన హోర్డింగులకు అనుమతులను ఏమాత్రం ఇవ్వొ ద్దన్నారు. ప్రైవేటు భవనాలపై వాల్‌ పెయింట్స్‌ కు ఎటు వంటి అనుమతిలేదని, ఇప్పటికే ఉన్నవాటిని వెంటనే చెరిపించేయాలన్నారు.

రాజకీయ ప్రతినిధులతో కలెక్టర్‌ సమీక్ష

పల్నాడు జిల్లాలో రాజకీయ పార్టీల సమావేశం జిల్లా కేంద్రం నరసరావుపేట కలెక్టరేట్‌ లో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్‌ హాజరయ్యారు. అదనపు జిల్లా ఎస్పీ రాఘ వేంద్రరావు, జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో 85 ఏళ్లు దాటిన వారు ఎంతమంది ఉన్నారు? వారి నుండి ఏ విధంగా ఇంటిదగ్గర ఓటు తీసుకుంటారని రాజకీయ పార్టీల ప్రతినిధులు అడిగారు. రైల్వే అధికారులను, మీడియా వారిని, ఆర్టీసీ వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఇవ్వాలని రాజకీయ ప్రతినిధులు కోరారు. సమయం వచ్చి నప్పుడు తప్పనిసరిగా, వీరందరికీ ఓటు హక్కును కల్పిస్తామని చెప్పారు. రాజకీయ పార్టీ ప్రతినిధుల వినతులను కలెక్టర్‌ స్వీకరించారు. వారికి సమాధానం ఇవ్వాలని డిఆర్‌ఒకు సూచించారు.

➡️