ఎన్నికల విధుల్లో బాధ్యతగా వ్యవహరించండి

Feb 23,2024 21:42
ఫొటో : మాట్లాడుతున్న ట్రైనర్‌ పి.చంద్రశేఖర్‌ రెడ్డి

ఫొటో : మాట్లాడుతున్న ట్రైనర్‌ పి.చంద్రశేఖర్‌ రెడ్డి
ఎన్నికల విధుల్లో బాధ్యతగా వ్యవహరించండి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ఇప్పటి వరకు కొత్తగా ఓటర్లను చేర్చడం, మృతులు, గ్రామాల్లో నివాసం లేని వారి ఓట్లు తొలగించడం లాంటివి నిర్వహించిన బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌ లైన ఒఎల్‌ఒలు రానున్న ఎన్నికల్లోనూ బాధ్యతగా వ్యవహరించాలని ట్రైనర్‌ పి.చంద్రశేఖర్‌ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆత్మకూరు నియోజకవర్గస్థాయి 6మండలాలు, పట్టణ పరిధిలోని బిఎల్‌ఒలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆర్‌డిఒ మధులత ఆదేశాలతో మాస్టర్‌ ట్రైనర్లతో ఈ శిక్షణ తరగతులు జరిగాయి. ట్రైనర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల పోలింగ్‌ జరిగే రోజుకు ఒకరోజు ముందుగా కేటాయించిన ఆయా పోలింగ్‌ కేంద్రాలో ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. ఏవైనా ఓట్ల పేర్లు పెండింగ్‌ వస్తే వాటిని పరిశీలించి పి.ఒ.లకు సహకరించాలన్నారు. దొంగ ఓట్లు పోల్‌ కాకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. ప్రతి ఓటర్‌కు డోర్‌ టు డోర్‌ వెళ్లి ఓటర్‌కు ఓటర్‌ స్లిప్పు అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఇతర ట్రైనర్లు జి.రామిరెడ్డి, శివకుమార్‌, హరనాథ్‌, అన్ని సచివాలయాల బి.ఎల్‌.ఒ. సిబ్బంది పాల్గొన్నారు.

➡️