ఎపిటిఎఫ్‌ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

Feb 4,2024 20:26

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : ఎపిటిఫ్‌ విజయనగరం జిల్లా నూతన కమిటీ ఎన్నికైంది. ఆదివారం జిల్లా పరిషత్‌ మినిస్టీరియల్‌ భవనంలో జిల్లా కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉపాధ్యాయ సమస్యలపై చర్చించి అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. 25మంది తో జిల్లా కమిటీ ఏర్పాటు కాగా, నలుగురిని రాష్ట్ర కౌన్సిలర్లగా ఎన్నుకున్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా షేక్‌ బుకారిబాబు, పి.శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునే విధంగా, ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం చేసి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో జిల్లా గౌరవాధ్యక్షులు బంకురు జోగి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️