పిహెచ్‌సిని సందర్శించిన డిఎంహెచ్‌ఒ

Jun 20,2024 21:23

 ప్రజాశక్తి- మెంటాడ  : మెంటాడ పిహెచ్‌సిని గురువారం డిఎంహెచ్‌ఒ ఎస్‌.భాస్కరరావు ఆకస్మికంగా సందర్శించారు. పిహెచ్‌సిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పిహెచ్‌సి పరిధిలో ఉన్న పిట్టాడ వెల్‌నెస్‌ సెంటర్‌ను సందర్శించారు. బిసిజి వ్యాక్సిన్‌ వేస్తున్న తీరును పరిశీలించి సంతృప్తి చెందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిసిజి వ్యాక్సిన్‌ గూర్చి ప్రచారం చేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రత, సీజనల్‌ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వైద్య సిబ్బంది గ్రామాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రోగులపట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పిహెచ్‌సి వైద్యాధికారులు లోకప్రియ, కల్పన, సిహెచ్‌ఒ ఎస్‌.సత్యనారాయణ, ల్యాబ్‌ టెక్నీషియన్‌ తాడ్డి మన్మథరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

➡️