ఎమ్మెల్యే ‘అన్నా’ కే టిక్కెట్‌ ఇవ్వాలి

ప్రజాశక్తి- కొమరోలు : వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబుకు టిక్కెట్‌ కేటాయించాలని వైసిపి నాయకులు కోరారు. కొమరోలు గ్రామంలో ఎమ్మెల్యే అన్నాకు మద్దుతుగా సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్‌పిటిసి సారే వెంకటనాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలో వైసిపి అభ్యర్థి గెలవాలంటే అన్నా రాంబాబుకు తప్పనిసరిగా టిక్కెట్‌ ఇవ్వాలన్నారు. వైసిపి సీనియర్‌ నాయకుడు సుబ్బారాయుడు మాట్లాడుతూ గత ఎన్నికలో గిద్దలూరు నియోజకవర్గంలో 82,000 మెజారిటీ గెలుపొందిన అన్నా వెంకట రాంబాబుకు టిక్కెట్‌ ఇవ్వక పోతే పార్టీ మనుగడకే ముప్పు వాటిల్లుతుందన్నారు. ఈ సమావేశంలో సర్పంచులు ఎంపిటిసిలు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️