ఎమ్మెల్సీ ఇల్లు ముట్టడి.. ఎమ్మెల్యేలకు వినతులు

మంగళగిరిలో ఎమ్మెల్సీ హనుమంతరావు ఇంటి వద్ద ధర్నా చేస్తున్న అంగన్వాడీలు
ప్రజాశక్తి – మంగళగిరి : జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన సమ్మో ఉధృతంగా కొనసాగు తోంది. బుధవారం నాటికి సమ్మె 16వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా అంగన్వా డీలు మంగళగిరి పట్టణంలో ర్యాలీ నిర్వహించి, ఎమ్మెల్సీ మురుగుడు హను మంతరావు నివాసాన్ని ముట్టడించారు. ఎమ్మెల్సీ లేకపోవడంతో పిఎకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ మాట్లాడారు. మాట్లాడుతూ అంగన్వాడిల సమస్య లను పరిష్కరించకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో అంగన్వాడీల సత్తా ఏంటో చూపుతారని అన్నారు. నాయకులు వి.దుర్గారావు, వై.కమలాకర్‌, జె.బాలరాజు, ఎం.బాలాజీ, అంగన్వాడి యూనియన్‌ నాయకులు హేమలత, కిరణ్మయి, పి ఫాతిమా, వినీల, రుక్మిణి, భూలక్ష్మి, సుజాత, మేరీ రోజమ్మ, జయ, సరళ, తిరుపతమ్మ పాల్గొన్నారు.
ప్రజాశక్తి-తాడేపల్లి : దీక్ష శిబిరాన్ని ఆశ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి ఆమె సందర్శించి మద్దతుగా మాట్లాడారు. ప్రభుత్వం కాలయాపన చేయకుండా అంగన్‌వాడీల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. పరిష్కారం కాకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం శిబిరం నుంచి మంగళగిరి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఇంటి వరకు ర్యాలీ నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి వై.నేతాజీ, తాడేపల్లి పట్టణ కార్యదర్శి వి.దుర్గారావు, అంగన్‌వాడీలు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-తెనాలిరూరల్‌ : స్థానిక వియస్సార్‌ కళాశాల ఎదురుగా సమ్మె శిబిరం నుండి ప్రదర్శనగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ కార్యాలయం వద్దకు వెళ్లారు. ఎమ్మెల్యేకు తమ సమస్యలను వివరించి వినతిపత్రం ఇచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్య లను ప్రభుత్యం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. సమ్మెకు విఘాతం కలిగించ కుండా పోలీసులకు ఆదేశాలిచ్చామని చెప్పారు. నాయకులు ఎవిఎన్‌ కుమారి, పి.పావని, అనూరాధ, కె.నాగలక్ష్మి, రంగ పుష్ప, డి.కళాధరి, శాంతకుమారి, లావణ్య, రాధాకుమారి, హసీనబేగం, ధనలక్ష్మి, సుజాత, రత్నకుమారి, సిపిఎం నాయకులు కె.బాబుప్రసాద్‌, రైతు సంఘం నాయకులు ఎం.శివసాంబిరెడ్డి పాల్గొన్నారు.
ప్రజాశక్తి పొన్నూరు రూరల్‌ : ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్యకు వినతిపత్రం ఇచ్చారు. సమస్యలను సిఐటియు జిల్లా అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్యలను సిఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. నాయకులు ఎన్‌వి సుకన్య, రత్న మంజుల, విజయలక్ష్మి, లావణ్య, సౌమ్య, సిఐటియు మండల కార్యదర్శి రమేష్‌బాబు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా దీక్ష శిబిరాన్ని జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్లు, ఇతర నాయకులు సందర్శించి మద్దతు తెలిపారు.
ప్రజాశక్తి – తాడికొండ : సమ్మె శిబిరం కొనసాగింది. సిఐటియు, పెన్షనర్లు మద్దతు తెలిపారు.
ప్రజాశక్తి – పెదకాకాని రూరల్‌ : స్థానిక సెంటర్లో సమ్మె శిబిరం కొనసాగింది. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.శివాజి మాట్లాడారు.

➡️