ఎమ్మెల్సీ సాబ్జీకి అశ్రునివాళి

Dec 15,2023 21:09

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పిడిఎఫ్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మృతికి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు, కార్యకర్తలు ఘన నివాళి అర్పించారు. సాబ్జీ మృతి విషయం తెలుసుకున్న వీరంతా సమ్మె శిబిరం వద్ద ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో జరుగుతున్న అంగన్వాడీ పోరాటానికి సంఘీభావం తెలియజేసి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరమని యూనియన్‌ జిల్లా అధ్యక్షులు పైడిరాజు, సిఐటియుజిల్లా కార్యదర్శి ఎ.జగన్మోహన్‌ అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

➡️