ఎల్‌ఐసి ఏజెంట్లు అభినందనీయులు

ప్రజాశక్తి- కడప అర్బన్‌ ఎల్‌ఐసి కడప బ్రాంచ్‌ పరిధిలో ఏడుగురు ఏజెంట్లు ఎండిఆర్‌టి (మిలియన్‌ డాలర్‌ రౌండ్‌ టేబుల్‌) స్థాయిలో బీమా వ్యాపారం చేయడం అభినందనీయమని బ్రాంచ్‌ మేనేజర్‌ వెంకటకష్ణ అన్నారు. 2023, జనవరి 1 నుంచి డిసెంబర్‌ 31 లోగా రూ.35 లక్షల కంటే ఎక్కువగా ప్రీమియం సేకరించి ఎండిఆర్‌టి స్థాయికి చేరుకున్న బి.మునెయ్య, జిఎల్‌ నరసింహులు, యస్‌.ఇస్మాయిల్‌, జి.కష్ణమూర్తి, ఎన్‌.ఏ.రవూఫ్‌, ఆర్‌.నిత్యానంద రెడ్డి, డి.కాశిం హుస్సేన్‌ కు స్థానిక బ్రాంచ్‌ కార్యాలయ సభాభవనంలో జరిగిన సన్మాన సభ నిర్వహించారు. విజేతలను సంస్థ తరపున ఘనంగా సన్మానించారు. వీరంతా అమెరికా లేదా కెనడా దేశాలలో జూన్‌లో నిర్వహించే అంతర్జాతీయ ఆర్థిక రంగ ప్రొఫెషనల్స్‌ సమావేశాల్లో పాల్గొంటారని అన్నారు. సన్మాన కార్యక్రమంలో అధికారులు చలమారెడ్డి, విజరు కుమార్‌ రెడ్డి, విజయ మోహన్‌ రెడ్డి, లియాఫీ కడప అధ్యక్షుడు నిత్యానంద రెడ్డి, యూనియన్ల నాయకులు సంజరు, అమర్నాథ్‌ బాబు, అవధానం శ్రీనివాస్‌, అక్బర్‌ బాషా, హబీబుల్లా ఖాన్‌, రాజు, కుమార్‌ పాల్గొన్నారు.

➡️