అధ్వాన్నంగా తర్లువాడ రోడ్డు

Jun 25,2024 23:29 #Tharuluvada Road damage
Tharuluvada Road damange

 ప్రజాశక్తి-ఆనందపురం: మండలంలోని తర్లువాడ జంక్షన్‌ నుంచి గ్రామానికి వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ గ్రామంలో ఫార్మసీ కళాశాల ఉంది. కళాశాలకు వెళ్లేందుకు విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పూర్వపు ఎమ్మెల్యే కర్రి సీతారాం చొరవతో గతంలో రోడ్డు ఏర్పాటుచేశారు. ఎన్నో ఏళ్లుగా దాన్ని పట్టించుకోకపోవడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. అడుగడుగునా గుంతలయ్యాయి. ఈ రోడ్డుకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని స్థానిక స్వచ్ఛంద సేవకుడు కోరాడ ఆదినారాయణ కోరారు.

➡️