ఎస్‌ఆర్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభం

షాపింగ్‌ మాల్‌ ప్రారంభం

ప్రజాశక్తి-అమలాపురంఅమలాపురంలో ఎస్‌ఆర్‌ షాపింగ్‌ మాల్‌ 12వ బ్రాంచ్‌ను నిర్వాహకులు సోమవారం ఘనంగా ప్రారంభించారు. షాపింగ్‌ మాల్‌ను మంత్రి విశ్వరూప్‌ ప్రారంభించారు. అమలాపురం ఎంపీ అనురాధ పట్టుచీరల సెక్షన్‌, పి.గన్నవరం ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు కిడ్స్‌ వేర్‌ కౌంటర్‌, కలెక్టర్‌ హిమాన్షు శుక్లా జెంట్స్‌ వేర్‌ సెక్షన్‌, ఎంఎల్‌షి బొమ్మి ఇజ్రాయెల్‌ లేడీస్‌ సెక్షన్‌, అమలాపురం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ గొల్లపూడి డేవిడ్‌ పిల్లల సెక్షన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి రాశీఖన్నా సందడి చేశారు. ఆమెతో ఫోటోలు దిగేందుకు యువత పెద్ద ఎత్తున పోటీపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్‌ మాట్లా డుతూ అమలా పురంలో ఇలాంటి షాపింగ్‌ మాల్స్‌ రావడం వల్ల పట్టణం అభివృద్ధి చెంద డంతో పాటు ఉద్యోగ అవ కాశాలు దొరు కుతాయని తెలి పారు. అనం తరం ఎస్‌ఆర్‌ షాపింగ్‌ మాల్‌ యాజ మాన్యానికి శుభా కాంక్షలు తెలిపారు. ఎంపీ అనురాధ మాట్లాడుతూ ఎస్‌ఆర్‌ షాపింగ్‌ మాల్లో మహిళలు ఎక్కువ మంది పని చేస్తున్నారని, మహిళలకు ఉద్యోగా వకాశాలు కల్పించిన ఎస్‌ఆర్‌ షాపింగ్‌ మాల్‌ ఎమ్‌డి కృతజ్ఞతలు తెలిపారు. కరెక్టర్‌ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటైన జిల్లాలో వివిధ రకాల షాపింగ్‌ మాల్స్‌ వస్తున్నాయని, జిల్లాలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ఇలాంటి షాపింగ్‌ మాల్‌ ఏర్పాటు చేస్తే రకరకాల డిజైన్లతో కూడిన దుస్తులు డోర్‌ స్టేప్‌ వద్దే దొరికే అవకాశం ఉందన్నారు. షాపింగ్‌ మాల్స్‌ ఏర్పాటు వల్ల ఈ ప్రాంతవాసులకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని అన్నారు. ఎస్‌ఆర్‌ షాపింగ్‌ మాల్‌ ఎండీ ఎస్‌ఆర్‌.గోపీనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ రానున్న పండుగల కోసం ప్రత్యేక ఆఫర్లు ఇవ్వనున్నామని, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల్‌ డైరెక్టర్‌ ప్రసాథెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️