ఎస్‌ఎఫ్‌ఐ నూతన కమిటీ ఎన్నిక

Dec 19,2023 20:31
ఎస్‌ఎఫ్‌ఐ నూతన కమిటీ

ఎస్‌ఎఫ్‌ఐ నూతన కమిటీ
ఎస్‌ఎఫ్‌ఐ నూతన కమిటీ ఎన్నిక
ప్రజాశక్తి-నెల్లూరు ఎస్‌ఎఫ్‌ఐ రూరల్‌ అధ్యక్ష, కార్యదర్శులుగా సుకుమార్‌, పి.సంతోష్‌కుమార్‌లు ఎన్నికైయ్యారు. మంగళవారం వేదాయపాళెం ప్రాంతంలోని సిపిఎం రూరల్‌ కార్యాలయంలో ఎస్‌ఎఫ్‌ఐ రూరల్‌ 8వ మహాసభ నిర్వహించారు. ముందుగా ఎస్‌ఎఫ్‌ఐ రూరల్‌ కమిటీ ఆధ్వర్యంలో కరెంట్‌ ఆఫీస్‌ సెంటర్‌ నుంచి బాబు జగజ్జీవన్‌రావు విగ్రహం సెంటర్‌ వరకు విద్యార్ధులు భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులకు అమ్మ ఒడి జెవిడి బకాయిల్ని వెంటనే రిలీజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ మరియు నెల్లూరు జిల్లాలో గవర్నమెంట్‌ కళాశాలలో వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు అదేవిధంగా నెల్లూరులో ఉన్న కళాశాలలో అధిక ఫీజులు వసూలు చేయడం దారుణమన్నారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ రూరల్‌ కమిటీ నూతనంగా 15 మందితో ఎన్నుకోవడం జరిగినది. అధ్యక్ష కార్యదర్శులుగా సుకుమార్‌ పి సంతోష్‌ కుమార్‌ సహాయ కార్యదర్శిగా ఉపాధ్యక్షులుగా శివ చక్రి సిసింద్రీ సిద్దు కమిటీ ఎన్నుకోవడం జరిగింది

➡️