ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల భిక్షాటన

Dec 29,2023 21:11

 ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌  :  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజ్‌ తదితర డిమాండ్లతో ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం పదో రోజు కొనసాగింది. వీరి ఆందోళనలో భాగంగా పార్వతీపురం చర్చి కూడలి నుంచి స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా ఆసుపత్రి కూడలిలో ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి వినతిని అందజేసి ప్రధాన రహదారిలో భిక్షాటన చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణతో పాటు పలువురు నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో జెఎసి నాయకులు రమేష్‌, లక్ష్మణరావు, భారతి, వందన, దమయంతి, తదితరులు పాల్గొన్నారు.

➡️