ఎస్‌ఐకు ఉద్యోగానికి ఎంపికైన శ్రీలతకు అభినందన

శ్రీలతను సత్కరిస్తున్న సర్పంచ్‌చిన్నవరాజు, ఎంపిడిఒ గౌరీ కుమారి

ప్రజాశక్తి-ఉప్పలగుప్తం

ఎన్‌. కొత్తపల్లి సర్పంచ్‌ కుంచే చిట్టికుమారి, చిన్నిల కుమార్తె శ్రీలత ఎస్‌ఐ ఉద్యోగానికి ఎంపికైంది. శ్రీలత ఉప్పలగుప్తం సచివాలయం,-2లో మహిళా పోలీస్‌ గా పనిచేస్తోంది. ఈ సందర్భంగా గురువారం ఉప్పలగుప్తం పంచాయతీ కార్యాలయంలో శ్రీలతను స్థానిక సర్పంచ్‌, సర్పంచ్‌ ల సమాఖ్య మండల అధ్యక్షుడు కడిమి చిన్నవరాజు, ఎంపిడిఒ కెఎస్‌. గౌరీకుమారి, పంచాయతీ కార్యదర్శి తిక్కిరెడ్డి రామకృష్ణ,సిబ్బంది దుశ్శా లువా కప్పి పూలమాలలతో సత్కరించి అభినందించారు.

 

 

➡️