ఎస్‌ఐకు ప్రశంసాపత్రం అందజేత

Mar 20,2024 21:58
ఫొటో : ఎస్‌ఐకు ప్రశంసాపత్రం అందజేస్తున్న ఎస్‌పి

ఫొటో : ఎస్‌ఐకు ప్రశంసాపత్రం అందజేస్తున్న ఎస్‌పి
ఎస్‌ఐకు ప్రశంసాపత్రం అందజేత
ప్రజాశక్తి-మర్రిపాడు : చోరీ కేసులో నిందితులను 24గంటల్లో పట్టుకున్న ఎస్‌ఐ విశ్వనాథరెడ్డికి బుధవారం ఎస్‌పి తిరుమలేశ్వర్‌రెడ్డి ప్రశంసాపత్రం అందజేశార. మండల కేంద్రంలో ఇటీవల రాత్రి సమయంలో టీ దుకాణం నడుపుతున్న మహిళమెడలో ఉన్న బంగారు చైన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అపహారించుకు వెళ్లారు. చైన్‌ స్నాచింగ్‌ కేసును సవాలుగా తీసుకొని నిందితులను 24 గంటల్లో ఎస్‌ఐ విశ్వనాథరెడ్డి కేసును ఛేదించి నిందితులను పట్టుకున్నారు. వారివద్ద నుండి బంగారు చైన్‌ను తీసుకొని బాధితురాలికి అందజేశారు. ఈ మేరకు ఎస్‌ఐ విశ్వనాధ్‌ రెడ్డితో పాటు సిబ్బంది రామకృష్ణ, శ్రీనివాసులు రెడ్డిలను ఎస్‌పి తిరుమలేశ్వర రెడ్డి అభినందించి ప్రశంసాపత్రం అందజేశారు.

➡️