ఎస్‌ఐగా కె.జగ్గవరం యువతి ఎంపిక

టి.నరసాపురం : మండలంలోని కె.జగ్గవరం గ్రామానికి చెందిన యువతి పరసా రాధిక ఎస్‌ఐ ఉద్యోగానికి ఎంపికయ్యారు. కె.జ గ్గవరం గ్రామానికి చెందిన పరసా ప్రసాదరావు, వేణమ్మ దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్నపాటి వ్యవసాయం చేసుకుంటున్నారు. పేద కుటుంబానికి చెందిన రాధిక రెండో సంతానం కాగా ఇంజనీరింగ్‌ వరకు కష్టపడి చదివింది. ఎస్‌ఐ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న ఆమె ఎలాగైనా ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా సాధన చేసింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఎస్‌ఐగా ఎంపికైనట్లు కుటుంబీకులు తెలిపారు. ఎంపికైన ఆమెను సర్పంచి తడికలపూడి శివమాధవి అభినందించారు.

➡️