‘ఎస్‌టియు’ ఎపి వజ్రోత్సవ పోస్టర్‌ ఆవిష్కరణ

మామిడికుదురు హైస్కూల్లో పోస్టర్‌ ఆవిష్కరణ

ప్రజాశక్తి-మామిడికుదురు

మామిడికుదురు హైస్కూల్‌ నందు మండల ఎస్‌టియు శాఖ ఆధ్వర్యంలో 2024 జనవరి 12, 13 తేదీల్లో కర్నూల్‌ ఎగ్జిబిషన్‌ ప్రాంగణం లో జరిగే ఎపి ఎస్‌టియు 75వ వజ్రోత్సవ సంబరాలు పోస్టర్లను కరపత్రాలు హైస్కూల్‌ హెచ్‌ఎం చిట్టినీడి నిరంజని శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో మండల శాఖ అధ్యక్షులు కారుపల్లి కళ్యాణ్‌ బాబు, ప్రధానకార్యదర్శి కొమ్ముల వీర రాఘవరావు, మట్టా నాగరాజు, జివివి.సత్యనారాయణ మానుపాటి మునీశ్వర్రావు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

 

 

➡️