ఎస్‌బిఐలో చోరీకి యత్నం

Dec 8,2023 22:00

ప్రజాశక్తి-కొత్తవలస  :  మండలంలోని చింతలపాలెం వద్దనున్న ఎస్‌బిఐ బ్రాంచిలో గురువారం అర్ధరాత్రి దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. రాత్రి గస్తీలో ఉన్న పోలీసుల రాకను పసిగట్టి దుండగులు పరారయ్యారు. అప్పటికే ఎటిఎం, బ్యాంకు తాళాలు తీసేశారు. అప్రమత్తమైన పోలీసులు బ్యాంకును క్షుణ్ణంగా పరిశీలించి క్లూస్‌ టీమ్‌కు సమాచారం అందించారు. శుక్రవారం ఉదయం క్లూస్‌టీమ్‌ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించింది. బ్యాంకుకు ఎటువంటి నష్టమూ కాలేదని చెబుతున్నారు.

➡️