ఎస్మా జిఒ పత్రాలు దగ్ధం

Jan 7,2024 22:01
ఫొటో : జిఒ పత్రాలు చూపుతున్న అంగన్‌వాడీ వర్కర్లు

ఫొటో : జిఒ పత్రాలు చూపుతున్న అంగన్‌వాడీ వర్కర్లు
ఎస్మా జిఒ పత్రాలు దగ్ధం
ప్రజాశక్తి-నెల్లూరు : రూరల్‌ మండలంలోని వెల్లంటి గ్రామ సచివాలయం ఎదుట ఆదివారం అంగన్‌వాడీలు ఎస్మా జిఒనెంబర్‌2 ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 27రోజులుగా సమ్మె చేస్తుంటే పట్టించుకోని ముఖ్యమంత్రి ఎస్మాను ప్రయోగించడం దారుణమన్నారు. తామేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీనే అమలు చేయాలని కోరుతున్నామన్నారు. హామీలు అమలయ్యే వరకూ తాము నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. అంగన్‌వాడీలేమీ పర్మినెంట్‌ ఉద్యోగులు కాదని వారికి ఎస్మా చట్టం వర్తించని తెలియజేశారు. సిఎం జగన్‌మోహన్‌రెడ్డి అంగన్‌వాడీల సమ్మెను విచ్ఛిన్న చేయాలనే ఆలోచనను విరమించుకొని, తమన్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో నెల్లూరురూరల్‌ సౌత్‌మోపూరు సెక్టార్‌ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీదేవి, పాదర్తి.నాగభూషణమ్మ, లీడర్లు ఎస్‌.పద్మ, పి.భవాని, పి.పద్మ, తదితరులు పాల్గొన్నారు.

➡️