ఏడిద గ్రామాభివృద్ధే లక్ష్యం

 

నేత్ర వైద్యశిబిరాన్ని ప్రారంభిస్తున్న పురుషోత్తం, ఆశీర్వాదం

ప్రజాశక్తి-మండపేట

ఏడిద గ్రామాభివృద్ధ్దే తన లక్ష్యమని నామాల పురుషోత్తం అన్నారు. గురువారం ఏడిద గ్రామంలో పురుషోత్తం తల్లిదండ్రులు నామాల వీర్రాజు సీతారత్నంల జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసిన ఎల్‌వి ప్రసాద్‌ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ప్రాథమిక కంటి వైద్య శిబిరాన్ని నామాల పురుషోత్తమ్‌ దంపతులు సర్పంచ్‌ బూరిగ ఆశీర్వాదంతో కలిసి ప్రారంభించారు. ఆశీర్వాదం మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి పురుషోత్తం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఇప్పటికే జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సౌకర్యాల కల్పనతో పాటు పోటీ పరిక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కొరకు లైబ్రరీ ఏర్పాటు చేశారన్నారు. సోమవారం నుంచి శనివారం వరకూ పనిచేసే కంటి వైద్య శిబిరంలో వైద్య సేవలో సద్విని చేసుకోవాలన్నారు. అనంతరం ఎల్‌వి ప్రసాద్‌ సంస్థ అధినేత నిరంజన్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు కంటి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పురుషోత్తం సహకారంతో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసామన్నారు.కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి పసుమర్తి నాగేశ్వరరావు, నామాల వాసుదేవరా, వార్డ్‌ మెంబర్‌ చిలుకూరి బుజ్జి, తహశీల్దార్‌ టిఆర్‌.రాజేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి వీర్రాజు, తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️