ఏప్రిల్‌ 16 నుంచి కోదండరాముడి బ్రహ్మోత్సవాలు

ప్రజాశక్తి-ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 16 నుంచి అంగ రంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టిటిడి జెఇఒ వీరబ్రహ్మం పేర్కొన్నారు. శుక్రవారం బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై ఆయన అధికా రులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్‌16న సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఏప్రిల్‌ 22న శ్రీ కోదండరాముడి కల్యాణం కమనీయంగా నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే ఏర్పాట్లపై అధికారులతో చర్చించి సూచనలు చేశామన్నారు. బ్రహ్మోత్సవాలకు, కల్యాణానికి హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నా మన్నారు. నెల రోజుల ముందే టిటిడి ఈ పనులను ప్రారంభించిందని తెలి పారు. కల్యాణోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయాల్సిన గ్యాలరీలు, భక్తులను అనుమతించాల్సిన విధానం, తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీపై సమీక్షిం చామన్నారు. గ్యాలరీల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సారి మరింత మెరుగైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కల్యాణ వేదిక అలంకరణ, సాంస్కృతిక కార్యక్ర మాలు అందరిని అలరించేలా నిర్వహిస్తామన్నారు. భక్తులం దరికీ ముత్యాల తలంబ్రాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయనతో పాటు టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ నాగేశ్వరరావు, ఎస్టేట్‌ ఆఫీసర్‌ గుణభూషణరెడ్డి, డిప్యూటీ ఇఒలు, నటేష్‌బాబు, ప్రశాంతి, అదనపు అరోగ్యాధికారి డాక్టర్‌ సునీల్‌ ఉన్నారు.

➡️