ఐక్యంగా పనిచేస్తే గెలుపు తథ్యం

Mar 22,2024 21:49

 ప్రజాశక్తి-గజపతినగరం :  రానున్న ఎన్నికల్లో ఐక్యంగా పనిచేస్తే గెలుపు నల్లేరుపై నడకేనని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని గంగచోళ్లపెంట గ్రామంలో టిడిపి మండల అధ్యక్షులు అట్టాడ లక్ష్మునాయుడు అధ్యక్షతన పార్టీ మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం అవసరమని చెప్పారు. లేకుంటే ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మండలంలో వివిధ గ్రామాల నుంచి వైసిపి నుంచి 100 కుటుంబాలు టిడిపిలో చేరాయి. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవులు, జనసేన పిఎసి సభ్యులు పడాల అరుణ, మాజీ ఎంపిపి గంట్యాడ శ్రీదేవి, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

➡️