ఐక్య పోరాటాలతోనే సమస్యల పరిష్కారం

ప్రజాశక్తి- గిద్దలూరు రూరల్‌ : ఐక్య పోరాటాలతో సమస్యలు పరిష్కారం అవుతాయని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ తెలిపారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ గిద్దలూరు ప్రాజెక్ట్‌ జనరల్‌ బాడీ సమావేశం డి.స్వర్ణ అధ్యక్షతన స్థానిక హరిప్రియ ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ అంగన్‌వాడీలు 42 రోజుల పాటు ఐక్యంగా సమ్మె నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి అంగన్‌వాడీల డిమ్లాంను అంగీకరిస్తూ జీవోలు జారీ చేసినట్లు తెలిపారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం.రమేష్‌ మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం భవిష్యత్‌లో పోరాటాలు చేయాల్సి ఉంటుందన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను రద్దు చేసే పనిలో ఉందన్నారు. అందుకు వ్యతిరేకంగా ఈనెల 16న చేపట్టిన దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలన్నారు. అనంతరం అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నూతన కమిటీని ఎన్నుకున్నారు. గిద్దలూరు ప్రాజెక్టు కమిటీ అధ్యక్షురాలుగా డి. స్వర్ణకుమారి ,ఉపాధ్యక్షులురాలిగా విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా మున్నా , సహాయ కార్యదర్శిగా మహాలక్ష్మి , కోశాధికారిగా నాగలక్ష్మి, మరో 19 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు టి.ఆవులయ్య, బి.నరసింహులు, డి.థామస్‌ , అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు దేవమ్మ, లక్ష్మీదేవి, కొండమ్మ ,పార్వతి ,సుబ్బలక్ష్మి పాల్గొన్నారు.

➡️